PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్ర..

1 min read

ప్రత్తి కోలంక గ్రామంలో అడుగడుగునా నీరాజనాలు..

విచ్చేసిన ప్రజా ప్రతినిధులు వైసీపీ నాయకులు, అశేషజన వాహిని..

ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన సర్పంచ్ ఘంటసాల మహాలక్ష్మి రాజు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్లలంక  గ్రామంలో ప్రజలు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహల మధ్య దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి  రెండో విడత ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ప్రత్తి కోళ్లలంక సర్పంచ్ ఘంటసాల మహాలక్ష్మి రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం కొల్లేరు ప్రజానీకం ఘన స్వాగతం పలికారు.  కొల్లేరు గ్రామంలో ప్రజానీకంతో నాయకులతో అధికారులతో కిక్కిరిసి ప్రాంతం పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున కాల్చిన బాణాసంచారు, తీన్మార్ డప్పుల మోతలు, జై జగన్, జై అబ్బయ్య చౌదరి నినాదాలతో మార్మోగిన కొల్లేరు ప్రాంతం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపరెపలాడింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కి పూలమాలలు వేసి పాదయాత్రను మొదలు పెట్టిన ఎమ్మెల్యే ఆడపడుచుల ఆత్మీయ హారతులు, యువకుల కరచాలనాలు, ఏలూరు రూరల్ మండల ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల ప్రజల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూతో కొనసాగిన పాదయాత్ర రాత్రి అయినా సమయాన్ని కూడా లెక్కచేయకుండా చివరి వరకు కొనసాగారు. ఏలూరు ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు, జడ్పిటిసి మండల సరస్వతి కొండలరావు, వైస్ ఎంపీపీ సత్యప్రసాద్, పైడి చింతపాడు సర్పంచ్ తిమోతి  ఇతర నేతలు  అశేష జనవాహినితో ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగించారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తో.రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ ఆయనతో అడుగులో అడుగు వేశారు.విచ్చేసిన ప్రతి ఒక్కరూ  బొకేలు అందజేసి ఆకాశానికి ఎగసిపడే బాణ సంచాకాల్చి  ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ప్రత్తి కోళ్లలంక గ్రామస్తులతో బంటపెద్దలు  ఆప్యాయంగా  మాట్లాడుతూ పాదయాత్ర నిర్వహిస్తూ వారి వారి సమస్యలను తెలుసుకుంటూ, పాదయాత్రను  ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి  జనకోలాహలంతోగ్రామ సచివాలయం  సెంటర్కు  చేరగా గ్రామస్తులు ఘన స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తనకు బస ఏర్పాటు చేసిన గృహానికి చేరి అక్కడ ప్రజల నుండి వినతులు స్వీకరించి, రెండో విడత మొదటి రోజు ప్రజా ఆశీర్వాద యాత్రను ముగించారు.

About Author