ముమ్మడి నారాయణరెడ్డి భౌతిక గాయానికి ఎమ్మెల్యే నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: శివాలపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెద్దాయన గా పిలువబడే ముమ్మడి నారాయణ రెడ్డి మంగళవారం రాత్రి మృతి చెందడం జరిగింది, శివాలపల్లి గ్రామ సర్పంచ్ గా పలు పర్యాయాలు ఆయన పని చేయడం జరిగింది, అంతేగాకుండా గ్రామ పంచాయితీ అభివృద్ధికి ఆయన ఎంతో దోహదపడడం జరిగింది, నారాయణరెడ్డి మరణ వార్త తెలియగానే గురువారం ఉదయం కమలాపురం శాసనస సభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి శివాల పల్లి లోని ఆయన స్వగృహానికి చేరుకొని ఆయన మృత దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు, ముమ్మడి నారాయణరెడ్డి సీనియర్ పొలిటికల్ నాయకులుగా, అలాగే చాలా పర్యాయాలు శివాలపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా ఆయన రాజకీయపరమైన అపారమైన అనుభవం తో శివాలపల్లె గ్రామపంచాయతీ ప్రజలసమస్యలపై అలుపెరగని రాజీపడని పోరాటం చేసి గ్రామ పంచాయితీ అభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు, అందుకే ఆయన శివాలపల్లె గ్రామపంచాయతీ పెద్దాయనగా పేరొందా రని తెలిపారు, అలాంటి వ్యక్తి మరణం శివాలపల్లె గ్రామపంచాయతీ ప్రజలకు , అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి కూడా తీరని లోటని ఆయన అన్నారు, అలాంటి నాయకుని ఆశయాల కోసం ప్రజలకోసం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ gnభాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ రామ సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, ఎంపీటీసీ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.