PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే భార్య ఆత్మ‌హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మహారాష్ట్రలోని శివసేన ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ భార్య రజనీ మంగేష్ కుందాల్కర్ ఆత్మహత్య చేసుకుంది. మంగేష్ కుందాల్కర్ కుర్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముంబైలోని తన నివాసంలో రజనీ ఉరివేసుకుని కనిపించింది. ఎమ్మెల్యే భార్య రజనీ ఆత్మహత్యకు పాల్పడినట్లు ముంబై పోలీసులు చెప్పారు. ముంబై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

                                      

About Author