ఎమ్మెల్సీ అనంతబాబుని భర్తరఫ్ చేయాలి
1 min readరిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ కడప : దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుని పదవి నుండి భర్తరఫ్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మరియు సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని మరియాపురం వద్ద ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ చేసిన సంఘటన దుర్మార్గమైందని అన్నారు. దళిత యువకుడిని చంపిన ఎమ్మెల్సీ ఇప్పటికి వైకాపా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అలాంటి వ్యక్తిని వైకాపా వెనకేసుకురావడం దారుణమన్నారు. అనంతబాబుని ఎమ్మెల్సీ పదవి నుండి డిస్మిస్ చేయకుండా పదవిలో కొనసాగించడం తగాదన్నారు. తక్షణం అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించి కేసును సిబిఐ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి దళితులపై దాడులు, వేధింపులు అధికమయ్యాయని, దళితులకు వైకాపా ప్రభుత్వం లో రక్షణ లేకుండా పోయిందన్నారు. వైకాపా ప్రభుత్వానికి దళితులు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్పీ ఐ దక్షిణాది రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి నాగదసరి అజయ్ ప్రసన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి సునీల్ కుమార్, కడప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మందపల్లి రాజేంద్రప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ట్రేడ్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగనపల్లి నరసింహులు, స్టేట్ లీగల్ అడ్వైజర్ ఎల్లటూరి రమేష్ బాబు, కడప నగర అధ్యక్షులు నాగదాసరి గాంధీ పాల్గొన్నారు.