ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ మరో 14 రోజులకు పెరిగింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయనకు తొలి రిమాండ్ పూర్తి అయింది. దీంతో అనంతబాబు రిమాండ్‌ను పొడిగించాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు మెమో ఎక్స్ టెన్షన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి అనంతబాబు రిమాండ్‌ను ఈ నెల 20 వరకూ పొడిగించారు. అయితే అనంతబాబుకు బెయిల్ కోరుతూ ఈ నెల 1న లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.