ఎమ్మెల్సీ బీటీ నాయుడు సన్మానానికి తరలిరండీ..
1 min read
జిల్లాల అధ్యక్షులు తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ పిలుపు..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికబీ టీ.నాయుడుకు ఈనెల 13వ తేదీ ఆదివారం జరిగే సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు,నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లాల అధ్యక్షులు ప్యాలకుర్తి తిక్కా రెడ్డి మరియు మల్లెల రాజశేఖర్ బుధవారం సాయంత్రం అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రెండవ సారి శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సంధర్బంగా వారిని కర్నూలు తెలుగుదేశం పార్టీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈనెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు కర్నూలులో జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగే సన్మాన కార్యక్రమానికిఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు,పార్లమెంట్ సభ్యులు,ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జీలు, ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయి కమిటీల నాయకులు,చైర్మన్లు, క్లస్టర్,యూనిట్,బూత్ ఇంచార్జీలు, నాయకులు మరియు కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని వారు పత్రికా మూఖంగా కోరారు.