ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి..విజయవాడలో
1 min readకారుణ్య నియామకాలు చేపట్టాలి : ఏపీటీఎఫ్ -1938
పల్లవెలుగు వెబ్, రాజనగరం జిల్లా: ఆదర్శ పాఠశాలలో పని చేస్తూమరణించినఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు ఇంతవరకు కారుణ్య నియామకాలు కల్పించలేదని కాబట్టి వెంటనే వారికి కారుణ్య నియామకాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని,అలాగే ఆదర్శ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని, వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని,అలాగే పదోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగరి శ్రీనివాసులు, మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.పి. గురువయ్య, నగిరి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలంలోని రాజనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపిటిఎఫ్ 1938 పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చామల అనిల్ వెంకటప్రసాద్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కరోనా సమయంలో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబ సభ్యులకు రెండు సంవత్సరములు కావస్తున్న ఇంతవరకు కారుణ్య నియామకాలు కల్పించలేదని, కాబట్టి వెంటనే వారికి కారుణ్య నియామకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేసే ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేలు ప్రకటించి అమలు చేయాలని ,వారికి బదిలీలకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు .జనవరి 2022, జూలై 2022 నుండి చెల్లించాల్సిన రెండు విడతల కరువు బత్యాలను వెంటనే విడుదల చేయాలని, అలాగే డి.ఏ. బకాయిలను కూడా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు జూనియర్ కళాశాల అధ్యాపకులకు, అలాగే డిగ్రీ కళాశాల అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారుఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి .ఎస్. వరాహమయ్య ,ఏపిటిఎఫ్ సీనియర్ నాయకులు ఎం .అబ్దుల్ రహీం ,వై .ఆంజనేయులు, వై. విజయ్ కుమార్ , ఎం. తిమ్మారెడ్డి, ఎల్ .శ్రీనివాస్ రెడ్డి, పూల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.