NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాటసాని రామిరెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు స్వగృహం నందు ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా స్థానిక సంస్థల వైయస్సార్ పార్టీ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేయుచున్న డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన జరగబోయే స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా వైయస్సార్ పార్టీ తరఫున తాను పోటీ చేయడం జరుగుతుందని కాబట్టి బనగానపల్లె నియోజకవర్గం లోని ఎంపీటీసీల మద్దతు తనకు కావాలని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి గారి సహాయ సహకారాలు తనకు ఉండాలని కోరారు.ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన జరగనున్న ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి వైయస్సార్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మధుసూదన్ పోటీ చేయడం జరుగుతుందని ఆయనకు తన సంపూర్ణమద్దతుఉంటుందనిచెప్పారు.బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులందరితో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి గారు, కుమ్మరి కర్నూలు నంద్యాల జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాల్ రెడ్డి గారు, పట్టణ 41 వ వార్డు కౌన్సిలర్ శ్వేతా రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

About Author