ఆక్యుపంక్చర్ వైద్యుడు డా. మాకాల సత్యనారాయణ ను అభినందించిన ఎంఎల్సీ
1 min read
విజయవాడ, న్యూస్ నేడు : అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయంలో ‘యోగశక్తి సాధన సమితి’ వ్యవస్థాపక చైర్మన్ ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యుడు డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు,బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు,ప్రస్తుత కేంద్ర బిజెపి సభ్యుడు సోము వీర్రాజు అభినందించారు.22 సంవత్సరాలుగా ఆక్యుపంక్చర్ వైద్యం చేయటమే కాకుండా వేల మందికి శిక్షణ ఇచ్చినందుకు ఈ సత్కారం అని తెలిపారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ విన్నపము,ప్రయత్నము వలన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆక్యుపంక్చర్ వైద్యమును భారతదేశంలో ప్రత్యేక విభాగ చికిత్సగా గుర్తింపు ఇచ్చారని తెలియజేసినారు.ఆక్యుపంక్చర్ వైద్యం పొందుతున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖ పెరాలసిస్‌తో బాధపడి చికిత్స చేయించుకుంటున్న జి పవన్ కుమార్ వయసు 33 సంవత్సరాలు ఆయన చెబుతూ తాను నాలుగు రోజులుగా ఆక్యుపంక్చర్ వైద్యము వల్ల వ్యాధి 50 శాతం తగ్గిందని తెలిపాడు. భారతదేశంలో ఈ వైద్యం అభివృద్ధికి బోర్డును ఏర్పాటు చేసి ప్రోత్సహించనున్నట్లు మరియు డాక్టర్ మాకాల సత్యనారాయణ విన్నపము’ అమరావతిలో ఆక్యుపంక్చర్ హబ్’ ఏర్పాటుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు తెలియజేసి,వారి సహకారంతో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. తమ కార్యాలయమునకు వచ్చి ఆక్యుపంక్చర్ వైద్యమును పరిశీలించి,తనను సత్కరించినందుకు డాక్టర్ మాకాల సత్యనారాయణ ఎం ఎల్ సి సోము వీర్రాజుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం సభ్యుడు డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.