PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

1 min read

– ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పోతుల నాగరాజు కత్తి నరసింహారెడ్డి గారికి మద్దతుగా

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం బనగానపల్లె మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూ మార్చిలో జరిగే శాసనమండలి ఎన్నికలలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు యూటీఎఫ్ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన కుల సంఘాలు ప్రజా సంఘాలు బలపరుస్తున్న ఉద్యమ నాయకులు పోతుల నాగరాజు గారిని కత్తి నరసింహారెడ్డి గారిని గెలిపించాలని బనగానపల్లె పట్టణంలో పెండేకంటి పబ్లిక్ స్కూల్ ఇల్లూరు కొత్తపేట జడ్పీహెచ్ హై స్కూల్ డాల్ఫిన్ స్కూల్ ఆక్సిలియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జడ్పీహెచ్ఎస్ కొండపేట ప్రైమరీ స్కూల్ కొత్తపేట స్కూలులో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మార్చిలో జరిగే శాసనమండలి ఎన్నికలలో పోతుల నాగరాజు కత్తి నరసింహారెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు . ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు పెరుగు శివకృష్ణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివయ్య విద్యార్థి సమాఖ్య నాయకులు నక్క రాజేష్ షేక్ యునిస్ రాజు హరి బాలు సుభాష్ సంపంగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author