NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండలంలోని బూర్గుల మరియు కౌలుపల్లి గ్రామాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంను క్లస్టర్ ఇంచార్జి మాజీ ఎంపీపీ ఆర్ ఈ రాఘవేంద్ర టిడిపి ప్యాపిలి మండల ప్రెసిడెంట్ గండికోట రామసుబ్బయ్య అధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా బుధవారం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష పార్టీగా నిరుద్యోగ యువతకు చేసిన వాగ్దానాల గురించి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ వదులుతాం డిగ్రీ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు దాటి పోతుంది ,నాలుగు జనవరిలు నెలలు కూడా పోయాయి ఐదో జనవరి రావుస్తోంది, ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వదిలిన పాపాన పోలేదు లేనిపోని ఆశలు కల్పించి కల్లబొల్లి మాటలు చెప్పి మాట ఇచ్చి మడమతిప్పినటువంటి ఈ ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అయినా అందరూ కూడా తగిన బుద్ధి చెప్పే విధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిని బలపరుస్తూ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పేరు ప్రక్కన బ్రాకెట్లో ఒకటి అంకెని వేసి అందరు మద్దతు పలకవలసిందిగా ప్రతి ఒక్క ఓటర్ కి విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బట్ట సత్యం, జలదుర్గం విష్ణు మరియు బురుగుల గ్రామ నాయకులు కౌలుపల్లి గ్రామ నాయకులుతదితరులు పాల్గొన్నారు.

About Author