PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

1 min read

– బనగానపల్లెలో 80.93 శాతం గ్రాడ్యుయేట్,95.35 శాతం టీచర్స్ పోలింగ్
– ఓటుహక్కు వినియోగించుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
– పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో పశ్చిమరాయలసీమజిల్లాలగ్రాడ్యుయేట్,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం బనగానపల్లె నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ మధ్యాహ్నం నాలుగు గంటలకు ముగిసింది. బనగానపల్లె నియోజకవర్గంలో మొత్తం 7,774 గ్రాడ్యుయేట్ ఓటర్లు,710 ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా సాయంత్రం పోలింగ్ ముగిసేసరికి 6292 గ్రాడ్యుయేట్ ఓట్లు, 677 టీచర్స్ ఓట్లు పోలయ్యాయి. దీనితో నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ పోలింగ్ శాతం80.93, టీచర్స్ పోలింగ్ శాతం 95.35 నమోదైనట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి తెలిపారు. కాగా నియోజకవర్గంలోని బనగానపల్లె, కోవెలకుంట్ల, అవుకు,కొలిమిగుండ్ల, సంజమాల మండలాల్లో ఉదయంనుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్లు తరలివచ్చి వచ్చి తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా బనగానపల్లె సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బనగానపల్లె ఎస్సైలు రామిరెడ్డి పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాటసాని
బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని యూపీ పాఠశాలలోని 350 పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కట్టుదిట్టంగా పోలిస్ బందోబస్తు- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రఘువీర్ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి పర్యవేక్షణలో బనగానపల్లె సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఎస్సైలు రామిరెడ్డి పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ ఏర్పాటు చేసి, ఓటర్ల రాకపోకలను క్రమబద్దీకరించి పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలో భాగంగా బనగానపల్లె వచ్చేసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

About Author