PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించాలి

1 min read

– టెలి కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పొరపాట్లు జరుగకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.ఆదివారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కు సంబంధించిన ఏర్పాట్లపై నోడల్ అధికారులు,సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్ లు, తహసీల్దార్లు, ఎంపీడివో లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పోలింగ్ పార్టీలు అన్నీ పోలింగ్ కేంద్రాలకు చేరాయా, పోలింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడింగ్, షామియానా, తాగు నీరు, పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, భోజన వసతి, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ తదితర అంశాల గురించి సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్ లను అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ పార్టీలు అన్నీ చేరుకున్నాయని, బ్యారికేడింగ్,తాగునీరు తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశామని సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు కలెక్టర్ కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు..కచ్చితంగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ను ప్రారంభించాలన్నారు.తక్కువ ఓట్లు ఉన్నాయని, అందరూ ఓటు వేసేశారని, సిబ్బంది వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు. కచ్చితంగా సాయంత్రం 4 గంటల వరకు ఉండి తీరాలని సూచించారు..పోలింగ్ సిబ్బందికి భోజన వసతులు కల్పించాలని, తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రతి పోలింగ్ లొకేషన్ వద్ద మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్వో ను ఆదేశించారు..జంబో బ్యాలెట్ బాక్సుల నిర్వహణ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లు క్యూ లో వెళ్లేలా కచ్చితంగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు..ఓటు ఎవరికి వేస్తున్నారో తెలియకుండా ఉండేలా వెబ్ కాస్టింగ్,వీడియోగ్రఫీ చేయాలన్నారు..ఎన్నికల సిబ్బంది లో మహిళా ఉద్యోగులు ఉంటే ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల నాయకులకు సంబంధం లేని ఉద్యోగుల ఇళ్లు ఉంటే అక్కడ వారికి బస చేసేలా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ లకు సూచించారు..పోలింగ్ సిబ్బందికి భోజనం సరఫరా విషయంలో పరిశుభ్రమైన ఆహారం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు..పోలింగ్ కేంద్రాల లోపల నీరు లేకుండా చూసుకోవాలన్నారు..అలాగే తగిన లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.టెలి కాన్ఫరెన్స్ లో నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవోలు హరి ప్రసాద్, మోహన్ దాస్,నోడల్ అధికారులు పాల్గొన్నారు.

About Author