గోనెగండ్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం నందు ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో మొత్తం 1516 పట్టభద్రుల ఓట్లకు గాను 1228 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ సగటు 81 శాతం నమోదు అయింది. సోమవారం గోనెగండ్ల లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వెంకటరమణారెడ్డి పరిశీలించారు. అలాగే 46 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లకు గాను 43 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 93 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఆదోని డిఎల్పిఓ నూర్జహాన్ , మండల తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ లు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ బ్యాలెట్ పేపరు చాలా పెద్దదిగా ఉండడము, ఓటర్లు ఒకటికంటే ఎక్కువ మందికి ప్రాధాన్యత ఇవ్వడంతో మందకోడిగా కొనసాగిన పోలింగ్ మధ్యాహ్నం వరకు 40 శాతం వరకు ఉండి క్రమ క్రమంగా పుంజుకుంటూ ఎన్నికల సమయం ముగిసే సమయానికి 81 శాతానికి చేరుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద మరియు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సిఐ మోహన్ రెడ్డి తమ సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.