PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడలి

1 min read

– వైసీపీ నాయకుల మాయ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు.
– అబద్ధాల మాటలు చెప్పడానికి వైసీపీ మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి లకు సిగ్గు లేదా?.
– పత్రికల పై దాడి వైసీపీ ప్రభుత్వం నీచ స్థితికి దిగజారింది.
– టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకట స్వామి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డిని గెలిపించాలని మిడుతూరు మండలంలో వివిధ గ్రామాలలో పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టబద్రులను కోరుతూ ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, ఖాతా రమేష్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ, నిరుద్యోగ యువతీ యువకులలో ఆశలు రేకెత్తించేలా మాయ మాటలు చెప్పి, ప్రభుత్వం శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని, మాయ మాటలు చెప్పి మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులను, రైతులను, మహిళలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అన్ని రకాల ధరలు పెంచుతూ ప్రజల మీద పన్నుల భారం మోపుతూ మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుతూ రాక్షస ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి జగన్ రెడ్డి మాత్రం లక్షల కోట్లు సంపాదించుకోవడాన్ని వారి అక్రమాలను ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం అక్రమ కేసులు బనాయించడం జరుగుతుందని దుయ్యబట్టారు. ఈ రాక్షస పాలనకు పట్టభద్రులు మేధావులు అయినటువంటి వారందరూ బుద్ధి చెప్పాలని కోరారు.ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రాక్షస పాలన పతనానికి నాంది పలకాలని కోరారు.శనివారం కర్నూలు నగరానికి వచ్చినటువంటి మంత్రులు వారి స్థాయిని మరిచి అబద్ధపు మాటలు చెప్పడం సమంజసం కాదని హితవు పలికారు. ఒకవైపు ప్రజల పైన, మరోవైపు ప్రతిపక్ష నాయకుల పైన, వారి ఇళ్ల పైన, పార్టీ కార్యాలయాల పైన, దళితులపైన, బడుగు బలహీన వర్గాల పైన, మహిళల పైన దాడులు చేస్తూ మేము ఎలాంటి దాడులు చేయడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షం వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం సిగ్గుమాలిన చర్య అని ఎద్దేవా చేశారు. మంత్రుల హోదాలో ఉండి ఇలా అబద్ధాలు మాట్లాడడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి బుర్రకథలు చెప్పే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు. నేడు పత్రికలు, టీవీ ఛానల్లు, సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, గుండాయిజాలు చూపిస్తా ఉంటే అలాంటి పత్రికల పైన కూడా దాడులు నిర్వహించేటువంటి నీచస్థితికి దిగజారి కూడా ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదు అన్నారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ వైసీపీ నాయకులకు సిగ్గు, లజ్జా, మానం ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకులను, ప్రజలను స్వేచ్ఛగా తిరగనివ్వండి సవాల్ విసిరారు.టీడీపీ కి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక వారిపైన అక్రమ కేసులు బనాయించి, అరెస్టులు చేయించి, వాహనాలు సీజ్ చేసి, మైకులు లాక్కొని, ఇలా ఎన్ని అడ్డంకులు సృష్టించిన లోకేష్ బాబు గా “యువగళం” పాదయాత్ర ఆగదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన”ఇదేమి కర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి మైనారిటీ సెల్ పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సుల్తాన్ మండల నాయకులు రవీంద్ర బాబు, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రవీంద్రారెడ్డి, రామభూపాల రెడ్డి, నాగేశ్వరరావు, నాగేంద్రుడు, బ్రహ్మానందరెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author