PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ఎస్సి మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యం.వి రామచంద్రారెడ్డి గారు మంగళవారం ఉదయం సందర్శించారు.జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను దుశ్శాలవలతో, పూల బొకేలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీపదో తరగతి పరీక్ష జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు వచ్చే సిబ్బందికి వేసవి కారణంగా అసౌకర్యం కలగకుండా తీసుకున్న చర్యలను, వసతులను పర్యవేక్షించారు. ప్రతి గదికి ఫ్యాన్లు, లైట్లు ఉండేలా చూడాలన్నారు. త్రాగునీరును అందుబాటులో ఉంచాలన్నారు. ఎలాంటి ఇక్కట్లు లేకుండా స్పాట్‌ కొనసాగేందుకు సిబ్బందికి దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులు స్పాట్ వేల్యూషన్ రెన్యువరేషన్ పెంచినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ యం.వి రామచంద్ర రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘనేతలు తమ సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు అందించారు. యం. వి. రామచంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్లు ఉంటాయని, DA కూడా విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి అర్ టి యు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ కొండూరు శ్రీనివాసరాజు, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రెటరీ మడితాటి నరసింహారెడ్డి, డిసిఇబి సెక్రెటరీ నాగముణిరెడ్డి, వివిధ సంఘాల ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు.

About Author