ఎంఎంఎస్ అకౌంటెంట్ మాధవ స్వామి ఆత్మహత్య
1 min read-మంగళవారం మధ్యాహ్నం వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్
-తర్వాత స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాధవ్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రం మహిళా మండల సమాఖ్య పొదుపు కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న డాలు మాధవస్వామి(30) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో సంచలనం సృష్టించింది.గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు దేవనూరు గ్రామానికి చెందిన డాలు వెంకటేశ్వర్లు,రమణమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు వీరిలో చిన్న కుమారుడు మాధవస్వామి ఇతనికి నాలుగు సంవత్సరాల కిందట సుమిత్రతో వివాహం జరిగినది.మంగళవారం మిడుతూరు పొదుపు కార్యాలయ ప్రాంగణంలో జరిగిన వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరయ్యారు.ఈకార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు. తర్వాత కార్యాలయంలోనే మధ్యాహ్నం వరకు ఉండి 12 గంటల సమయంలో అమ్మకు ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వెళ్లి మళ్లీ వస్తానని కార్యాలయ సిబ్బందితో చెప్పి వెళ్ళాడు.తర్వాత తన స్నేహితుడితో వీడియో కాల్ చేసి తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మిడుతూరు చింతలపల్లి రహదారిలో కాకి లేరు బ్రిడ్జి నుంచి దేవనూరు పాత రహదారికి వెళ్లే రహదారిలో ఉన్న చెట్టుకు తన అంగితో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. మాధవ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు.నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకువెళ్లారని అన్నారు.ఆత్మహత్య చేసుకోవడం వల్ల మండలంలో చర్చనీయాంశంగా మారింది.మాధవ్ మంచి వ్యక్తిగా అందరితో చిరునవ్వుతో మాట్లాడుతూ పలకరించేవాడు అంటూ ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.