కర్నూలులో.. మొబైల్ రికవరీ..
1 min read564 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన ఎస్పీ
పల్లెవెలుగు వెబ్: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మొదటి సారిగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 564 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఆదివారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేశారు. కర్నూలు పోలీసులు ముందు రోజే ఫోన్ల ను అందజేసేందుకు బాధితులకు సమాచారం అందించి కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంకు పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మిడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. మొబైల్ ఫోన్ లతో పాటు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన భాద్యత పోలీసులపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న భాదితులు ఇచ్చిన వివరాలను బట్టి 564 ఫోన్లు రికవరీ చేశామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారం పై కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కూడా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పొగోట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. గౌరవ డిజిపి, ప్రభుత్వం ఆదేశాల మేరకు మొబైల్ రికవరీ మేళా నిర్వహించామన్నారు. నేరాల నివారణకు పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెల మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తామన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు మొబైల్ ఫోన్ పోతే మీ – సేవా కు వెళ్ళి ఎలా అఫ్లై చేయాలో ,కర్నూలు జిల్లా పోలీసు లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ గోడ పత్రికను ప్రతి గ్రామా సచివాలయాల్లో మహిళా పోలీసులచే అతికిస్తామన్నారు. కర్నూలు పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం వినియోగించుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ గారికి, పోలీసుయంత్రాంగానికి బాదితులు 1)మిట్టకందాల గ్రామానికి చెందిన స్కూల్ టీచర్ విశ్వప్రసాద్ 2) కర్నూలుకు చెందిన శ్రీ లక్ష్మీ సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని, కృతజ్ఞతలు తెలియజేశారు.
మొబైల్ ఫోన్ పోతే మీ – సేవా కు వెళ్ళి ఎలా అఫ్లై చేయాలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
1) మీ – సేవా నందు ఎలా అప్లై చేయాలి.
మీ మొబైల్ ఫోన్ పోయిందా బాధితులు తమకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రింది వివరాలు అందించినట్లయితే మీ మొబైల్ ను పోలీసు వారు తిరిగి ఇప్పించటం కోసం ఈ క్రింది వివరాలను మీరు మీ -సేవా నందు ఇవ్వవలిసి ఉంటుంది.
మీరు పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు ,
మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ యొక్క IMEI వివరాలు .
మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన మొబైలు నెంబర్ వివరాలు
మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా ,పేరు మొదలగు వివరాలు
మిమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నెంబర్ మరియు alternate కాంటాక్ట్ వివరాలు
ఈ వివరాలు మీరు మీ-సేవా నందు సమర్పించి Missing /lost articles రుసుము ను చెల్లించి , సదరు మీ-సేవా రసీదును తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇవ్వవలెను .
2) LOST MOBILE TRACKING SERVICE LINK…
kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి.
ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు ఈ క్రింది వివరాలను
మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి ,మీ మొబైలు కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు ,
మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలి.
ఈ విధంగా మీరు ఫిర్యాదు చేసినచో పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీలు వెంకటాద్రి , కెవి మహేష్, సిఐలు , ఎస్సైలు, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం ఎస్సై వేణుగోపాల్ మరియు సైబర్ ల్యాబ్ సిబ్బంది ఉన్నారు.