PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“ మొబైల్ రికవరీ మేళా ” కార్యక్రమం

1 min read

– 2 వ విడతలో రికవరీ చేసిన 1,047 ( రూ. 2 కోట్ల 50 లక్షల విలువ గల )
– మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన … జిల్లా ఎస్పీ
– పోగొట్టుకున్న ఫోన్ లను రికవరీ చేసి ఇవ్వడం తో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు.
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: మొబైల్ ఫోన్ పోతే … మీ సేవా కేంద్రాల కు వెళ్ళి గాని, లేదా kurnoolpolice.in/mobiletheft లింకు ను క్లిక్ చేసి వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే రెండవ విడతలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1047 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు శనివారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడారు. గౌరవ డిజిపి, ప్రభుత్వం ఆదేశాల మేరకు మొబైల్ రికవరీ మేళా నిర్వహించామన్నారు. ఈ రోజు(1000) వెయ్యి కి పైగా ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. 4 వేలకు పై ఫిర్యాదులు వచ్చాయని వాటిన్నింటి పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలు పోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మీడియా వారు సహకరించాలన్నారు. 100 శాతం మొబైల్ వెతికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. సైబర్ టీమ్ , ప్రతి ఒక్క పోలీసు స్టేషన్ లో ఇద్దరు పోలీసులు మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. మొబైల్ మిస్సింగ్ గురించి ప్రజలు పోలీసు స్టేషన్ లకు వెళ్ళడం పై అసౌకర్యంగా ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో డిజిపి గారి ఆదేశాల మేరకు సులభతరమైన పధ్ధతిలో మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి కర్నూలు పోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ కి వెళ్ళి ఏదైనా కంప్యూటర్ ద్వారా లేదా మొబైల్ ఫోన్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మిస్సింగ్ మొబైల్ వివరాలు అందించవచ్చన్నారు.దాని పై వెంటనే సైబర్ ల్యాబ్ బృందం ట్రేస్ చేస్తూ బాధితులకు మొబైల్స్ అందజేస్తున్నామన్నారు. మొదటి విడతలో 600 పైగా ఫోన్లు రికవరీ చేశామన్నారు. వాటి విలువ రూ. 1.2 కోట్ల విలువ ఉంటుందన్నారు.ఈ రోజు రెండవ విడతలో సుమారుగా 1047 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. వాటి విలువ 2.5 కోట్ల విలువ ఉంటుందన్నారు. 2 నెలల్లోనే ఈ సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి.ఈ విధంగా మీరు ఫిర్యాదు చేసినచో పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, కర్నూలు పట్టణ డిఎస్పీ కె వి మహేష్ , కర్నూలు టు టౌన్ సిఐ శ్రీనివాసులు, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం ఎస్సై వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ సిబ్బంది ఉన్నారు.

About Author