సంచార చికిత్స కార్యక్రమం ఆకస్మిక తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఈ తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పంచాలింగల గ్రామములో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ తలసేమియా అంటే వంశపారంపార్యంగా వచ్చే జన్యు సంబంధితమైన వ్యాధి, తల్లి తండ్రుల నుంచి ఈ ప్రాణంతక వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు వివాహం చేసుకోవాలంటే తప్పనిసరిగా తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవాలని తెలిపారు.తలసేమియా వ్యాధిగ్రాస్తులలో రక్త హీనత వలన అలసట, నీరసం, శరీరంలో వాపులు రావడం, పచ్చ కామెర్లు, వాంతులు, వీరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలొ వైద్యులు డాక్టర్. మంజూష, ఆరోగ్య కార్యకర్తలు, షీలా, వేణుగోపాల్, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.