PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరాడంబ‌రంగా మ‌లాల వివాహం

1 min read

పల్లెవెలుగు వెబ్​ : నోబెల్ శాంతి బహుమ‌తి గ్రహీత మ‌లాల యూస‌ఫ్ జాయ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బ్రిట‌న్ లోని బ‌ర్మింగ్ హామ్ లోని త‌న నివాసంలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహవేడుక జ‌రిగింది. 24 ఏళ్ల మ‌లాల అస్సర్ తో జీవితాన్ని పంచుకోనున్నారు. ఈరోజు త‌మ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజుని మ‌లాల ట్విట్టర్ వేదిక‌గా చెప్పారు. అస్సర్, తాను వివాహ బంధం ద్వార ఒక్కట‌య్యామ‌ని, బ‌ర్మింగ్ హ‌మ్ లోని త‌మ నివాసంలో నిరాడంబ‌రంగా నిఖా వేడుక జ‌రిగింద‌ని చెప్పింది. పాకిస్థాన్ లోని స్వాత్ లోయ‌లో జ‌న్మించిన మ‌లాల‌.. బాలిక విద్య కోసం గ‌ళ‌మెత్తారు. దీంతో 2012లో ఆమె పై ఉగ్రవాదులు దాడి చేశారు. మ‌లాల ఎడ‌మ క‌ణ‌తి పై, శ‌రీరంపై తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే పెషావ‌ర్ కు త‌ర‌లించి చికిత్స అందించ‌డంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం బ్రిట‌న్ త‌ర‌లించారు. కొన్ని శ‌స్త్ర చికిత్సల త‌ర్వాత ఆమె కోలుకున్నారు. అప్పటి నుంచి బ్రిట‌న్ లోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.

About Author