మోదీ రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో డిమాండ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజీనామా చేయాలంటూ బుధవారం ట్విట్టర్‌లో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. #ModiMustResign అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇండియా ట్విట్టర్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌లో ఉంది. కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్ష పార్టీలు, లాయర్లు, మేధావులు, విద్యావేత్తలతో పాటు బీజేపీ విధానాల్ని వ్యతిరేకించే ఎంతో మంది ప్రముఖులు ఈ ట్రెండింగ్‌లో పాల్గొనడం విశేషం. శ్రీలంకలో అదాని ఒప్పందంపై రేగిన వివాదం ఈ ట్రెండింగ్‌లో పెద్ద ఎత్తున చర్చకు కేంద్రంగా ఉంది.