మోదీ ఫోటో పెట్టడం పై కోర్టుకు.. లక్ష జరిమానా !
1 min readపల్లెవెలుగువెబ్ : వ‌్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పై ప్రధాని మోదీ ఫోటో పెట్టడం పై పీటర్ మైల్ పరంబిల్ అక్టోబర్ నెలలో కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్ వెనుక ప్రజాప్రయోజనాలు లేవని, ప్రచారం కోసమే వేశారని కోర్టు పేర్కొంది. ప్రజా తీర్పుతోనే మోదీ ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌కి హైకోర్టు రూ. 1 లక్ష జరిమానాను విధించింది. పైగా ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కెఎల్‌ఎస్‌ఎ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది.