NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజకీయనేరగాళ్లను కాపాడుతున్నమోడీసర్కార్

1 min read

– సిపిఐ కోయిలకుంట్ల బృందం హెచ్చరించారు.

 పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణంలో.క్రీడా కారులను లైంగికంగా వేదిపుల కు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని   జంతర్ మంతర్ లో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా క్రీడా కారులు పట్ల పోలీసులు లాఠీ చార్జి కి పాల్పడడం సిగ్గుచేటని సిపిఐ కోయిలకుంట్ల నాయకులు ఎస్. బాషా  అన్నారు. స్థానిక జె.వి భవన్   నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ ఢిల్లీ పురవీధుల్లో దాదాపు నాలుగు నెలల నుంచి రెజ్లర్స్ మహిళలపై లైంగిక వేధింపులు కురిచేస్తున్న బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్  వలన లైంగిక వేధింపులకు గురయ్యామని ఫిర్యాదు చేసి అనేక రూపాలలో ఆందోళనలు చేస్తూ చర్యలు తీసుకోవాలని పోరాటం  చేస్తున్న  వారి కంప్లైంట్ పై ఎటువంటి చర్యలు తీసుకో పోగా, మళ్లీ అతనిని,  కుటుంబ సభ్యుని మరలా జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్తున్న బిజెపి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది, బిలకిస్ బానుకేసులో దోషుల్ని బయటికి తీసుకొచ్చి దండలు వేసి సత్కరించారు,అత్రాస్ కేసులో దోషులకు శిక్ష పడకుండా చేశారు, ఉన్నవ్ ఘటన లో దోషులకు అండగా నిలిచారు. మహిళలపై అత్యాచారాలు  జరిగిన పలు చోట్ల  కారకులు బిజెపి వారు అని తెలిసి కూడా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా రు తప్ప దోషులను  శిక్షించటానికి ప్రయత్నాలు చేయడం లో చిత్త శుద్ది లేదని తేటతెల్లమైన సంఘటనలుఅనేకరాష్ట్రాల్లో జరుగుతున్నాయన్నారు.దేశం కోసం  మల్ల హొదులు జాతీయ,  అంతర్జాతీయ పతకాలు అవార్డులు గెలుచుకున్న యువతులు కష్టంతో చెమట చిందించి అనేక సందర్భాల్లో, మన జాతీయ జెండాను గర్వంగా ఎగురవేసి  ఉన్నతంగా నిలిచి,  దేశానికి కీర్తిని తెచ్చిన ఈ యువ ఔత్సాహిక మహిళల విజయాలను యావత్ భారతదేశం వారిదిగా నిలిచారన్నారు.తమపై ఎంపీ.మరియు జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు  బ్రిజ్ భూషణ శరణ్ సింగ్ దేశ విదేశాల గడ్డ మీద లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు అని అనేకమంది పిర్యాదులు చేసినా,ఫిర్యాదుదారుల్లో ఒక మైనర్ కూడా ఉన్నపటికీ పోలీసులు కేసు నమోదు చేసి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంది అని, అరెస్టు చేయకుండా న్యాయ చేయడం లో విఫలమైయ్యారన్నారు ఇదేనా బిజెపి పరిపాలనలో మహిళలకి రక్షణ అని అన్నారు. అభియోగాలు తీవ్రమైనవి  కాబట్టే న్యాయం చేయడానికి పోలీసుల నుండి తక్షణ చర్యలు అవసరమనిసిపిఐ నాయకులు గోపాల్ కిట్టు,చిన్న, రహీమ్ డిమాండ్ చేశారు.

About Author