రాయలసీమకు మోదీ ఎంతో చేశారు.. జగన్ ఏం చేశారు ?
1 min read
పల్లెవెలుగువెబ్ : రాయలసీమ అభివృద్ధికి జగన్ ఏం చేశారో చెప్పాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ రణభేరిలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. జగన్ ఆరాచక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం మోదీ ఎంతో చేశారని చెప్పారు. సీమ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం జగన్ హయాంలో కునారిల్లుతోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.