NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోదీ చేసిందేమీ లేదు.. బీహార్ లో కేసీఆర్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్‌ దేశానికి చేసిందేం లేదని, పైగా వినాశకర పరిస్థితి తీసుకొచ్చిందని ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు. బుధవారం పాట్నాలో బీహార్‌ సీఎం నితీశ్‌ కమార్‌తో భేటీ అనంతరం కేసీఆర్‌ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో పరిస్థితులు ఘోరంగా పడిపోతున్నాయ్‌. కనీసం ఒక్క రంగాన్ని కూడా మోదీ ప్రభుత్వం బాగు చేయలేదు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. ఏ ప్రధాని హయాంలో రూపాయి విలువ పడిపోలేదు. దేశరాజధాని ఢిల్లీలో నీళ్లకు, కరెంట్‌ కొరత నడుస్తోంది. దేశంలో ధరలు, అప్పులు పెరిగిపోయాయి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రం విఫలమైంది. సామాన్యులు, రైతులు.. అన్నీ వర్గాల వాళ్లు ఆందోళనలో ఉన్నారు. మోదీ సర్కార్‌ అసమర్థ నిర్ణయాలతో దేశంలో తిరోగమనంలో ఉంది. అని అన్నారు.

                                          

About Author