ఆ ఏపీ సీఎం చేతిలో మోదీ కీలుబొమ్మ
1 min readపల్లెవెలుగువెబ్ : 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు. ఆ సమయంలో దేశంలో ప్రధానిని విమర్శించిన తొలి వ్యక్తిని తానే అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో తాను అప్పుడు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే…అందరూ తప్పు బట్టారని సభలో చెప్పారు. కేంద్రంలోని మంత్రులు అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీకు ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారని ధ్వజమెత్తారు.