PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచ నేతల్లో మోదీ నెంబర్ వన్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ మోర్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. 71 శాతం మంది అనుకూలంగాను.. 21 శాతం మంది వ్యతిరేకంగా స్పందించడంతో ఆయనకు నెట్ అప్రూవల్ రేటింగ్ 50 ఉందని తెలిపింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు అతితక్కువ అప్రూవల్ రేటింగ్ వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. ప్రపంచ నేతలకు కల ప్రజాదరణను మోర్నింగ్ కన్సల్ట్ పరిశీలిస్తుంది. ఈ సంస్థ ఈ సర్వేను ప్రారంభించినప్పటి నుంచి ప్రదాని మోదీ అప్రూవల్ రేటింగ్స్ 2020 మే నెలలో అత్యధిక స్థాయిలో కనిపించాయి. అయితే గత ఏడాది కోవిడ్ రెండో ప్రభంజనం సమయంలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ అతి తక్కువ స్థాయికి పతనమయ్యాయి.

         

About Author