‘మోదీ’ అత్యంత ఖరీదైన సూట్.. ఇప్పుడు బుల్లెట్ ఫ్రూఫ్ రక్షణలో..!
1 min readపల్లెవెలుగు వెబ్: 2015లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అతిథిగా అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా వచ్చారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూట్ అత్యంత ఖరీదైన సూట్ గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించి .. వార్తల్లోకి ఎక్కింది. 2015 ఫిబ్రవరి 20న ఆ సూట్ ను 11 లక్షలకు వేలం వేయగా.. గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి లాల్జీబాయ్ పటేల్ 4.31 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ సూట్ ను ప్రస్తుతం అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. లాల్జీబాయ్ పటేల్ పర్యవేక్షణలో బుల్లెట్ ఫ్రూఫ్ బాక్స్ లో ఈ సూట్ భద్రపరిచారు. మోదీ విగ్రహం తయారు చేయించి.. ఆ విగ్రహానికి ఈ సూట్ తొడిగారు. ఈ సూట్ ను ఏడాదికి రెండు సార్లు శుభ్రం చేస్తారు. జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు.