మోదీ, నితీష్ లకు పిల్లలు పుట్టాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లకు పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. వారికి పిల్లలు పుట్టాలని, వారు కూడా వంశపారంపర్య రాజకీయాలనే వాదనలో చేరాలని కోరుకుంటున్నానన్నారు. మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తాయని చెప్పారు. ‘‘నితీశ్ కుమార్, పీఎం మోదీలకు పిల్లలు లేకపోతే నేనేం చేయగలను? నితీశ్ కుమార్‌కు ఓ కుమారుడు ఉన్నాడు, కానీ ఆయన రాజకీయాలకు తగినవాడు కాదు. నేనేం చేయగలను? వారు కూడా వంశపారంపర్య రాజకీయాల్లోకి చేరే విధంగా వారికి కూడా పిల్లలు పుట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లాలూ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు.