NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార‌త ఆట‌గాళ్ల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన మోదీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందని కొనియాడారు. ప్రత్యర్థిపై గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు అభినందనలంటూ ట్వీట్ చేశారు. ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్లు తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గతేడాది ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్ బదులు తీర్చుకున్నట్టు అయింది.

                               

About Author