NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు విశాఖకు మోదీ

1 min read

పల్లెవెలుగువెబ్ : మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖకు చేరుకుంటారు. దానికి రెండు గంటల ముందే సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి విశాఖకు వస్తారు. విమానాశ్రయంలోనే కాసేపు విశ్రాంతి తీసుకొని, ప్రధాని రాగానే ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు. మరుసటిరోజు శనివారం ఉదయం 9.40 గంటలకు సీఎం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానానికి వస్తారు. ప్రధాని కూడా చోళ గెస్ట్‌హౌస్‌ నుంచి నేవీ హెలికాప్టర్‌లో బయల్దేరి 10.20 గంటలకు సభాస్థలికి వస్తారు. 11.45 గంటల వరకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అది పూర్తికాగానే హెలికాప్టర్‌లో బయలుదేరి ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. అక్కడ సీఎం తదితరులు ఆయనకు వీడ్కోలు పలుకుతారు.

About Author