రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ చేసిన మోదీ
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన రామానుజ సమతామూర్తి విగ్రహావిష్కరణ చేశారు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సమతామూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. రా.8 గం.కు రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం అవుతారు.