నేతాజీ హోలోగ్రామ్ ను ఆవిష్కరించిన మోదీ
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలో గ్రామ్ ను ఆవిష్కరించారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద హోలోగ్రామ్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఏదైనా సాధించగలం అనే నేతాజీ నినాదాన్ని ప్రేరణగా తీసుకోవాలని తెలిపారు. నేతాజి 125వ జయంతి వేడుకల సందర్భంగా హోలోగ్రామ్ ను ఆవిష్కరించారు. తాజీ ప్రేరణతో దేశసేవకు అంకితం కావాలని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీని స్థాపించి దేశం కోసం సాహసం, పరాక్రమం చూపారని అన్నారు. నేతాజీ దేశానికి గొప్ప వారసత్వాన్ని అందించారని ప్రధాని కొనియాడారు. నేతాజీతో ముడిపడి ఉన్న అన్ని ప్రదేశాలను స్మారక ప్రదేశాలుగా మారుస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. నేతాజీ ప్రేరణతో దేశసేవకు అంకితం కావాలని పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీని స్థాపించి దేశం కోసం సాహసం, పరాక్రమం చూపారని అన్నారు. నేతాజీ దేశానికి గొప్ప వారసత్వాన్ని అందించారని ప్రధాని కొనియాడారు. నేతాజీతో ముడిపడి ఉన్న అన్ని ప్రదేశాలను స్మారక ప్రదేశాలుగా మారుస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.