ఎంపీలకు మోదీ వార్నింగ్ !
1 min readపల్లెవెలుగు వెబ్ :ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీల గైర్హాజరు పై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే మార్పులు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలక క్రమం తప్పకుండా హాజరుకావాలని, చిన్న పిల్లలకు చెప్పినట్టు ప్రతిసారి చెప్పడం బాలేదని అన్నారు. ఇకనైనా ఎంపీలు తమని తాము మార్చుకోకపోతే సమయానుగణ మార్పులు జరుగుతాయని బీజేపీ ఎంపీలను హెచ్చరించినట్టు తెలుస్తోంది. మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో మోదీ వార్నింగ్ ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.