NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ పై మోదీ ఆగ్ర‌హం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. వరుసగా మూడోసారి హైదరాబాద్‌ వచ్చిన తనకు సీఎం కేసీఆర్‌ స్వాగతం పలకకపోవడం..మరీ ముఖ్యంగా, ఈసారి తనకు స్వాగతం పలకకపోవడంతో పాటు రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు స్వాగతం పలకడం, ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తనపై తీవ్ర దుర్భాషలాడడంపై మోదీ మనో వేదనకు గురైనట్లు తెలిసింది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో బీజేపీ ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం, అడుగడుగునా టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు పెట్టడం, చివరికి, వేదిక వద్ద కూడా బీజేపీ ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించి టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, పోస్టర్లు అంటించడాన్ని రాష్ట్ర నేతలు మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

                                        

About Author