NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్రంలో ఎవ‌రెంత తిన్నారో.. అవినీతి చిట్టా చేతిలో ఉంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నరేంద్ర మోదీ సర్కారు అవినీతి చిట్టా తన చేతిలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏ కేంద్ర మంత్రి ఎంత తిన్నాడో తనకు తెలుసని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘మోదీ… బిడ్డా నీ సంగతి, చరిత్ర కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాలు పెద్ద చిట్టా నా దగ్గర ఉంది. ఏ మంత్రి శాఖలో ఎంత అవినీతి జరుగుతుందో మొత్తం తెలుసు. కేంద్రంలో గుంట నక్కలు చేసే అవినీతి గురించి పెద్ద ఎత్తున నాకు ఫోన్లు వస్తున్నాయి. అవినీతి విషయంపై నిన్ననే మమత బెనర్జీ నాతో మాట్లాడారు. మొన్న ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు. 15 రోజుల కింద తమిళనాడు సీఎం స్టాలిన్‌ మంతనాలు చేసిండు’’ అని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

     
                         

About Author