NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోదీ కొత్త‌కారు ధ‌ర రూ.12 కోట్లు.. ఖండించిన అధికార వ‌ర్గాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ధాని మోదీ కొత్త‌కారు ధ‌ర‌పై జ‌రిగిన ప్ర‌చారాల‌ను అధికార వ‌ర్గాలు ఖండించాయి. ప్రధాని కాన్వాయ్‌లో కొత్తగా చేర్చినమెర్సిడెజ్‌ మేబ్యాచ్‌ ఎస్‌-650 గార్డ్‌ కారు ధర రూ.12 కోట్లు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా.. అధికార వర్గాలు మాత్రం ధర అందులో మూడో వంతు మాత్రమే ఉంటుందని చెబుతున్నాయి. పైగా ప్రతి రెండేళ్లకోసారి ప్రధాని కాన్వాయ్‌లో కార్లను మార్చడం సాధారణమేనన్నాయి. ఇంతకుముందు ఉపయోగించి బీఎండబ్ల్యూ కారు తయారీని జర్మనీ సంస్థ నిలిపివేసిందని తెలిపాయి. కాగా, అత్యంత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ కారును ప్రధాని భద్రత ను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ఎంపిక చేసింది. ఎలాంటి ప్రమాదం జరిగినా ఇందులో ప్రయాణించే వారికి హాని జరగని విధంగా డిజైన్‌ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ అయిన వీఆర్‌-10 రేటింగ్‌ దీని సొంతమ‌ని అధికారులు తెలిపారు.

                                         

About Author