PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోడీ విధానాలు దేశప్రజానికానికి ప్రమాదం… పి రామచంద్రయ్య

1 min read

ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ బంద్, జయప్రదం చేయండి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  మోడీ విధానాల వల్ల దేశ ప్రజానీకానికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, కేంద్ర కార్మిక,రైతు,వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16వ తేదీన జరిగే గ్రామీణ బంధు,పారిశ్రామిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ, శనివారం  ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక చదువులు రామయ్య భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి రామచంద్రయ్య గారు పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలు రైతుల పాలిట ఉరితాడులుగా మారి 5ఏళ్లలో 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. మోడీ తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ మూలంగా పరిశ్రమల్లో సంపద సృష్టించే కార్మికులను ఏ హక్కులు లేని బానిసలుగా మార్చాయని, కేంద్ర, రాష్ట్ర సంస్థలలో 23లక్షల పోస్టులు ఖాళీగా ఉన్న దేశంలో యువత ఉద్యోగాలులేకనిరుద్యోగభారతంగా వెలిగి పోతుందని విమర్శించారు.ప్రతిరోజు దేశంలో మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యాలుగా మారాయని, దళితులను, గిరిజనులను, మైనారిటీలను రెండవ తరగతి పౌరులుగా మార్చేందుకు నిత్యం బీజేపీ ఐటి సెల్, మోడీకోసం భజన చేసే మీడియాలో విష ప్రచారం నిర్వహించబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల ప్రతిరోజు ధరలు పెరుగుతున్నాయని, నిత్యవసర వస్తువులు ధరలు సామాన్యులకు అందుబాటులో లేని కారణంగా పౌష్టికాహారం లోపంచి ఆకలి చావులు పెరిగాయని, ఎన్నడూ లేనంతగా భారత దేశంలో పేదరికం పెరిగిందని, వీటిని పరిష్కరించలేక మోడీ రాముడి వెనుకాల దాక్కొంటూ, భావోద్వేగాలను ముందుకు తెస్తున్నారని తెలిపారు.పరిశ్రమల్లోని కార్మికులు,సంఘటీత అసంగటిత, వ్యవసాయ కార్మికులు ఫిబ్రవరి 16 స్వచ్చందంగా బంద్ లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. తక్షణం రైతు పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, కార్మికులకు కనీస వేతనం 26 వేలు చెల్లించి, 4 కోడ్లు రద్దు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు పంట నష్టం, ఇన్సూరెన్స్ కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజు వేతనం 600 చెల్లించాలని, అందుకు బడ్జెట్లో రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కారన్న అధ్యక్షతన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి రాజా సాహెబ్ జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఈరన్న ఉమామహేశ్వరరావు రైతు సంఘం నాయకులు రామానాయుడు మద్దిలేటి పరమేష్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author