మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పలకాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మోడీ ప్రజావ్యతిరేక నిరంకుశ పాలనకు చరమగీతం పలుకుదామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.రామ చంద్రయ్య పిలుపునిచ్చారు.కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలపై ఈనెల 14 నుండి 30 తేదీ వరుకు సీపీఐ,సిపిఎం సంయుక్తంగా తలపెట్టిన ప్రచార బేరి పాదయాత్ర జయప్రదం కోసం బుదవారం స్థానిక సిపిఐ కార్యాలయం ముందు గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి పాలనపై తీవ్రంగా మండిపడ్డారు.నరేంద్ర మోడీ పాలనను అంతమొందించేందుకు ప్రజాతంత్ర వాదులంతా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యులు గౌస్ దేశాయ్, సిపిఐ సిపిఎం ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.