మోదీ పర్యటనలో.. భద్రతా వైఫల్యం పై సీఎం స్పందన
1 min read
పల్లెవెలుగువెబ్ : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫ్యలం కారణంగా 20 నిమిషాలు కాన్వాయ్ ఆగిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పంజాబ్ ప్రభుత్వం పై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివరణ ఇచ్చారు. ప్రధాని రాక సందర్భంగా రైతుల నిరసనలపై మాట్లాడుతూ…”జరిగింది దురదృష్టకరమే. నిరసనకారుల గురించి పంజాబ్ హోం మంత్రి నాకు తెలిపారు. రైతులను శాంతింపజేసేందుకు సైతం మేము ప్రయత్నించాం. అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. ప్రధాని మోదీని కలుసుకునేందుకు హోం మంత్రిని పంపాను” అని ఆయన వివరించారు.