NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఆయ‌న తవ్విన గుంత‌లో మోహ‌న్ బాబు కుటుంబం ప‌డిపోయింది ’ !

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : సీనియ‌ర్ నటుడు న‌రేష్ తవ్విన గుంత‌లో మోహ‌న్ బాబు కుటుంబం ప‌డిపోయింద‌ని ప్రముఖ న‌టి జీవితరాజ‌శేఖ‌ర్ అన్నారు. ‘మా’ ఎన్నిక‌ల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జ‌న‌ర‌ల్ సెక్రట‌రీగా జీవిత పోటీ చేస్తోంది. ఎవ‌రు ఎరికైనా మ‌ద్దతు ఇవ్వొచ్చని, ధ‌ర్మంగా.. న్యాయంగా పోరాడాల‌ని జీవిత సూచించింది. ఇది మ‌న కుటుంబ‌మ‌ని, ఇక్కడ బెదిరింపులు, తాయిలాలు.. ప్రలోభాలు అన‌వ‌స‌ర‌మ‌ని ఆమె చెప్పింది. మీరు మంచి చేయండ‌ని చెప్పడానికి లంచం ఎందుకివ్వాల‌ని ప్రశ్నించింది. న‌రేష్ తవ్విన గుంత‌లో మోహ‌న్ బాబు కుటుంబం ప‌డింద‌ని అన్నారు. ‘మా’ విష‌యంలో న‌రేష్ స్వార్థంగా ప‌నిచేశార‌ని, ప్రకాశ్ రాజ్ నిజాయితీగా ప‌నిచేస్తార‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ చెప్పారు.

About Author