మోక్షగుండం విశ్వేశ్వరయ్య.. నేటి ఇంజనీర్లకు స్ఫూర్తి..
1 min read– ఉప పర్యవేక్షక ఇంజినీర్ కలిగితి రాజు
పల్లెవెలుగు వెబ్, ఏలూరు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నేటి తరం ఇంజనీర్లు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు ఉప పర్యవేక్షక ఇంజినీర్ కలిగితి రాజు . బుధవారం విశ్వేశ్వరయ్య 160వ జయంతిని పురస్కరించుకుని 53వ ఇంజనీర్స్ డే వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఇరిగేషన్ రైట్ మెయిన్ కెనాల్ (పిఐపి ఆర్ఎం సి) సర్కిల్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఇంజనీర్ కె రాజు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య నిగర్వి, నిరాడంబరుడు, కార్యశీలి అదేవిధంగా ఆర్థికవేత్తగా దేశ ఆర్థిక స్థితిగతుల పై అధ్యయనం చేసి ఎన్నో పుస్తకాలను రచించారని, ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం1955లో దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న మహోన్నత వ్యక్తి విశ్వేశ్వరయ్య కొనియాడారు. అన్నదాతలకు వరప్రసాదంగా ఎన్నో ప్రాజెక్టు నిర్మాణాలకు దిశ దశ నిర్దేశించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేటితరం ఇంజనీర్లు ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప పర్యవేక్షక ఇంజనీర్ కలిగితి రాజు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కే సురేష్ కుమార్, పి నాగమణి, ఆర్ భవాని, పి నాగవల్లేశ్వరి,పి గీత, ధూర్జటి కుమార్, త్రిపుర ప్రియదర్శిని,షఫీ, ఆర్ గౌరీ శంకర్ రావు, బి వై నాయుడు, ఎం ఆర్ కె చౌదరి, యు సత్యనారాయణ, పి కృష్ణ కాంత్, కే శ్రీనివాసరావు, కె భారతి, హరికుమార్, కె.ఆర్ ప్రత్యూష, బి అరుణకుమారి, జి స్వర్ణ, ఏవీఎస్ ప్రసాద్, యశోదమ్మ, ఎం శ్రీనివాసరావు, వి అబ్రహం పాల్గొన్నారు.