మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు..
1 min read– ఆయన్ని నేటితరం ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలి..
– ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : స్థానిక ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో..సర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162 వ జయంతి ని పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపర్డెంట్ ఇంజనీర్ కె.శ్రీనివాస్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవ ప్రకాష్. ఇరిగేషన్ సర్కిల్ ,,పోలవరం ఆర్ ఎం సి సర్కిల్లో పనిచేస్తున్న ఉప పర్యవేక్షక ఇంజనీర్ కె రాజు మరియు ఇంజినీర్లు, ఇరిగేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, మోక్షగుండం చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.. కావేరి నది పై ఆనకట్ట ని నిర్మించి కర్నాటక,, తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆయకట్టు కి నీరు అందించిన గొప్ప దార్శినికుడు అని, వారి సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదు, దేశంలోనే అత్యున్నత పురస్కారం భారత ప్రభుత్వం భారత రత్న బిరుదులను ప్రధానం చేసారని గుర్తు చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజున ఇంజనీర్స్ డే గా పరిగణించి 165 వ జయంతి సందర్భంగా 55 సంవత్సరాలుగా జరుపుతున్నారని తెలిపారు. అదే విధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఇంజినీరింగ్ పితామహుడు గా కొనియాడుతూ పిలుస్తారని ఆయన్ని నేటి తరం యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలియజేశారు.