ప్రపంచానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు ఎనలేనివి
1 min read– నిర్మాణాల రూపకల్పనలో ఆయనకు ఆయనే సాటి
– ఐజెకె ఇంజినీరింగ్ అకాడమీలో ఘనంగా ఇంజినీరింగ్స్ డే వేడుకలు
– టి.పద్మజ,ఐజెకె ఇంజినీరింగ్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్
పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : ప్రపంచానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు ఎనలేనివి అని,ప్రపంచంలో నిర్మాణాల రూపకల్పనలో ఆయనకు ఆయనే సాటి అని ఐజెకె ఇంజినీరింగ్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ టి.పద్మజ పేర్కొన్నారు.శుక్రవారం నగరంలోని బిర్లా కాంపౌండ్,ఐజెకె ఇంజినీరింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ రాంప్రసాద్ అధ్యక్షతన మేనేజింగ్ డైరెక్టర్ టి.పద్మజ విద్యార్థులతో కలిసి ఇంజినీరింగ్స్ దినోత్సవం పురస్కరించుకొని గాయత్రి ఎస్టేట్,క్లాక్ టవర్,ఇంజినీరింగ్ ప్రధాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా ఇంజినీరింగ్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా టి. పద్మజ మాట్లాడారు.ఇంజినీరింగ్స్ దినోత్సవం సందర్బంగా ఐజెకె ఇంజినీరింగ్స్ అకాడమీ తరుపున ఇంజినీర్స్ కు ముందుగా శుభాకాంక్షలు తెలియచేశారు.గత నాలుగు సంవత్సరాల క్రితం 2019,సెప్టెంబర్,2వ తేదీన ఐజెకె ఇంజినీరింగ్ అకాడమీ ప్రారంభించినట్లు చెప్పారు.నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తిచేసుకొని 5వ సంవత్సరంలో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.ఎంసెట్ నుంచి ఎంటెక్ వరకు అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దేలా కృషి చేస్తుందని అన్నారు.ఈ సదావకాశం సద్వినియోగం చేసుకుని మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా సిద్ధం కావాలని ఆమె తెలిపారు.విద్యార్థులు మాట్లాడుతూ ఐజెకె అకాడమీలో ఉపాధ్యాయులు మంచి శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. భవిష్యత్ లో ఇంజినీరింగ్ లో ప్రజల మన్ననలు పొందేలా అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వాములు,ఐటీ మేనేజర్ రహమతుల్లా, మార్కెటింగ్ మేనేజర్ రామాంజి, విద్యార్థులు పాల్గొన్నారు.