వైభవంగా మోక్షనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం మండలం రామాపురం క్షేత్రంలో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత మోక్షనారాయణ, శ్రీ వల్లీ దేవసేన సమేత ద్వికందర షణ్ముఖ సుబ్రమణ్య స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమాయ్యాయి. గుంటూరుకు చెందిన వేదంపండితులు సంతోష్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఉత్సవాలలో మొదటి రోజు మహాగణపతి పూజ, పుణ్యహవచనం, సంకల్పం, అంకురార్పణ, ధ్వజారోహనం, దీక్షహోమం తదితర పూజాధికాలు శాస్ట్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ స్వామి వార్లు హనుమధ్వాహనం, వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్లు వృషభ వాహనం పై మాధవీధులలో విహరించారు. ఆలయనిర్వాహకులు కాశిభట్ల సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో భక్తులకు వసతి, అన్నదాన ఏర్పాట్లు చేశారు.