ఒకరికి పంపాల్సిన డబ్బు ఇంకొకరికి పంపారా.. తిరిగి ఇలా తీసుకోండి !
1 min readపల్లెవెలుగువెబ్ : డిజిటల్ విప్లవంతో బ్యాంకు లావాదేవీలు చాలా వరకు ఆన్ లైన్ లోనే సాగుతున్నాయి. ఈ సందర్భంగా పొరపాటున ఒకరికి పంపాల్సిన డబ్బు మరొకరికి పంపిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అనుకోకుండా జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒక అకౌంట్ కు పంపాల్సిన డబ్బు మరొక అకౌంట్ కు పంపితే తిరిగి పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే దీని కోసం ఓ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.
- ఒకవేళ డబ్బులు గుర్తు తెలియని అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అయితే వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి.
- మీరు ఏ అకౌంట్‌కు డబ్బులు పంపారో ఆ అకౌంట్ నెంబర్ చెప్పండి. కస్టమర్ కేర్‌లో ఫిర్యాదు చేయండి.
- లావాదేవీ తేదీ, సమయం, అలాగే మీ అకౌంట్ నెంబర్, డబ్బుల ట్రాన్స్ ఫర్ చేసిన అకౌంట్ నెంబర్‌ను నోట్ చేసుకోండి.
- సంబధిత బ్యాంక్‌ను సందర్శించి బ్యాంక్ వివరాలతో పాటు తప్పుగా వేరే బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ ఫర్ చేశామని ఓ లెటర్ రాయాలి.
- మనం పైన చెప్పుకున్నట్లుగా మీరు ఎవరికైతే తప్పుగా పంపారో స్క్రీన్ షాట్లను ఆ లెటర్‌కు అటాచ్ చేయాలి.
- దీంతో బ్యాంక్ అధికారులు మీకు సంబంధిత అకౌంట్ హోల్డర్ వివరాల్ని అందిస్తారు.
- అదే బ్యాంక్ బ్రాంచ్ అయినట్లేతే నేరుగా పంపిన డబ్బుల్ని తిరిగి మీ అకౌంట్ పంపాలని బ్యాంక్ అధికారులు రిక్వెస్ట్ పంపిస్తారు.
- అది వేరే బ్యాంక్ అయితే మీరు ఎవరికైతే పంపారో వారి బ్యాంక్‌ను సందర్శించి లెటర్,ఈమెయిల్, స్క్రీన్షాట్లను సబ్మిట్ చేయాలి.
- మీరు ఇచ్చిన వివరాలు చెక్ చేసుకొని ఆ బ్యాంక్ అధికారులు సంబంధిత బ్యాంక్ అకౌంట్ హోల్డర్‌కు కాల్ చేసి డబ్బులు తిరిగి పంపాలని రిక్వెస్ట్ చేస్తారు.
- అలా రిక్వెస్ట్ చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ బ్యాంక్ నిర్దేశించిన రోజుల్లో డబ్బులు తిరిగి మీ అకౌంట్‌కు పంపిస్తాడు.
- అప్పటికి పంపకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది.