NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌నీట్రాప్.. ఎన్ఐఏ అదుపులో విశాఖ నేవీ అధికారులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. గుజరాత్‌, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. దేశానికి చెందిన కీలక సమాచారాన్ని నేవీ అధికారుల ద్వారా పాక్‌ గూఢాచారులు తస్కరించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. నేవీ అధికారులను మనీ ట్రాప్‌ కేసులో ఇరికించడంతో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. విశాఖలో 12 మంది నేవీ అధికారులను పాక్‌ గూఢాచారులు మనీట్రాప్‌ చేశారు. దీంతో ముంబై, గుజరాత్‌, విశాఖలో పలువురిని ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నది. 4 చోట్ల సోదాల్లో ఎలక్ట్రానిక్‌ డివైజర్స్‌, సిమ్‌కార్డులు, పలు కీలక పత్రాలను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

                                          

About Author