చైనాలో మంకీ బి వైరస్.. తొలి మరణం !
1 min readపల్లెవెలుగు వెబ్ : చైనాలో మంకీ బి వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ -19 చైనా నుంచే వచ్చిందని పలు వాదనలు ఉన్న నేపథ్యంలో మంకీ బీ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకి తొలి వ్యక్తి మరణించారు. మంకీ బీ వైరస్ సోకిన తొలి వ్యక్తి.. మరణించిన తొలి కేసు ఇదేనని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. మరణించిన వ్యక్తి స్నేహితులు వైరస్ బారిన పడలేదని , వారిలో లక్షణాలు లేవని గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనాలో ఓ పశువైద్యుడు కోతులపై పరిశోధనలు చేస్తుంటాడు. ఇటీవల ఆయన కోతులను రెండు భాగాలుగా కోసి వాటి పై ప్రయోగాలు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజలుకు ఆయన అనారోగ్యం బారినపడ్డాడు. వాంతులు, వికారంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స కోసం ప్రయత్నించాడు. అతడి ఆరోగ్యం క్షీణించడంతో మరణించాడు. అతడి నమూనాలను పరీక్షించగా అతనికి మంకీ బీ వైరస్ పాజిటివ్ అని తేలింది. మంకీ బీ వైరస్ బారిన పడి మరణించిన తొలి వ్యక్తి ఇతనేనని చైనా సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది.