మంకీ పాక్స్ తొలి కేసు నమోదు !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాలో మంకీ పాక్స్ వైరస్ తొలి కేసు నమోదైంది. యూఎస్ అంటువ్యాధుల సంస్థ సీడీసీ గురువారం దీనిని ద్రువీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితుడు ఇటీవల కెనడాలో పర్యటించినట్లు గుర్తించారు. వైరస్ సోకిన వ్యక్తికి మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని కాంటాక్స్ట్‌ని గుర్తించే పనిని అధికారులు ముమ్మరం చేశారు. ఇక కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో వైరస్ కేసులు నమోదయ్యాయి.